ఇద్దరం విడిపోతే భూమి బద్దలౌతుందా
ఇండియా పాకిస్తానోలె ఇనపకంచె పడుతుందా
రావొచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు
పద్యం పాడితె మేము వన్స్ మోర్ కొట్టొచ్చు
నీ ఇడ్లి బండి అడ్డజాగ నీవె నిలుపుకోవచ్చు
విశ్వనాధ, శ్రీశ్రీలకు వినమ్రంగ మొక్కొచ్చు
కానీ దాశరధిని కాళోజిని దాచిపెడితె తప్పుగాద
పొమ్మంటె పోవెందుకు పోర ఓ ఆంద్రదొర
యెట్టిమీద యేగలేక పొట్టచేతపట్టుకొని
వచ్చినోల్లను మేము వద్దనుంచుకుంటాము
దోచుకోనొచ్చినోడివి చూసుకోర నీ తోవ
పొమ్మంటె పోవెందుకు పోర ఓ ఆంద్రదొర
తెలుగు జాతి ఒక్కటని వగలబడిపోతున్నవ్
ఒక్కతల్లిబిడ్డలమే ఒప్పుకుంటమూ నిజము
అన్నదమ్ములిద్దరుంటె ఆస్ది పంచుకోరజెప్పు
బాధలల్లనీతొ నేను బాగముగలేద జెప్పు
యేగలేక ఆగమై యేరుబడిపోదమంటె
ఏర్పాటువాదమని యెక్కియెక్కి ఏడ్సుడేంది
పొమ్మంటె పోవెందుకు పోర ఓ ఆంద్రదొర
బతకనీకొచ్చినోన్ని బాయి బాయిగ జూస్తం
దోచుకోనొచ్చినోడ చూసుకోరనీ తోవ
పొమ్మంటె పోవెందుకు పోర ఓ ఆంద్రదొర
భాష ఒక్కటైతె నన్ను బాధపెట్టాలనుందా
జాతి ఒక్కటైతె నన్ను గోతిల ఎయ్యాలనుందా
పోలికలుండొచ్చుగాని పొంతన యాడుంది మనకు
యాసలల్ల తేడలేద బాషలల్ల తేడలేద
నీ అట్లతద్దెకు బతుకమ్మకు బందుత్వం ఎక్కడిది
పొమ్మంటె పోవెందుకు పోర ఓ ఆంద్రదొర
No comments:
Post a Comment